DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th JUNE 2023

1) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (CAD) జీడీపీ లో ఎంత శాతంగా నమోదు అయింది.?
జ : 2%

2) ‘ది యోగా సుత్రాస్ ఫర్ చైల్డ్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : రూపా పాయ్

3) QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగు – 2023లో ఐఐటీ బాంబే ఎన్నో స్థానంలో నిలిచింది. ?
జ : 149 (2022 లో 177 ర్యాంక్)

4) క్రెడిట్ కార్డ్ బేస్డ్ యూపీఐ పేమెంట్స్ ను మొట్టమొదట అమోదించిన బ్యాంకు ఏది.?
జ : కెనరా బ్యాంకు

5) 37వ జాతీయ క్రీడల మస్కట్ ని మోగా పేరుతో ఆవిష్కరించారు.? అది ఏ జంతువు యొక్క రూపం.?
జ : భారతీయ అడవి దున్న (indian bison)

6) భారత్ లో అత్యంత ఎత్తైన భవనాల జాబితాలో ఉన్న మొదటి రెండు నగరాలు ఏవి.?
జ : ముంబై, హైదరాబాద్

7) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2023లో బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తుల శాతం ఎంతగా ఉంది.?
జ : 3.9% (2018 లో 11.5%)

8) ముంబైలోని వెర్సోవా – బాంద్రా సీ లింక్ రోడ్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరి పేరును పెట్టింది.?
జ : వీడి సావర్కర్ సేతు

9) ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్ కు ఎవరి పేరును మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టింది.?
జ : అటల్ బిహారీ వాజ్‌పేయి

10) ఢిల్లీలోని ఔరంగాజేబ్ రోడ్డు పేరును ఎవరి పేరుతో మార్చారు.?
జ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

11) సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ భట్నాగర్

12) జాతీయస్థాయి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఏ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పరిశోధన కేంద్రం కోసం వచ్చే ఐదేళ్లలో 50వేల కోట్లను ఖర్చు చేయనుంది.?
జ : నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023

13) రైతులకు యూరియా సబ్సిడీలో సరఫరా చేయడానికి కేంద్రం ఎన్ని లక్షల కోట్ల రాయితీని ప్రకటించింది.?
జ : 3.68 లక్షల కోట్లు

14) తెలంగాణ ఏ ప్రాంతంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టిసిఎల్ ఎక్కడ 225 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనుంది.?
జ : రంగారెడ్డి జిల్లా రావిర్యాల

15) రసాయన ఎరువుల సమతుల్యానికి కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పథకం పీఎం ప్రణామ్ పూర్తి రూపం ఏమిటి.?
జ : ప్రధానమంత్రి ప్రోగ్రాం ఫర్ రిస్టోరేషన్, అవేర్‌నేస్ జనరేషన్, నరీస్‌మెంట్ అండ్ అమిలియోరేషన్ ఆఫ్ ద మదర్ ఎర్త్

16) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 9,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్ మాన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్టీవ్ స్మిత్ (సంగకర్ర మొదటి స్థానం)

17) వరుసగా విరామం లేకుండా 100 టెస్ట్ లు ఆడిన తొలి బౌలర్ గా , ఓవరాల్ గా ఆరో క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నాథన్ లియోన్

18)పర్యావరణహిత ఇంధనానికి మారడంలో (WEF – ఎనర్జీ ట్రాన్సిసన్ ఇండెక్స్ – 2023) భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 67వ స్థానం (స్వీడన్ మొదటి స్థానం)