న్యూడిల్లీ (జూన్ – 29) : యూనీయన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ అర్హతలు గల అభ్యర్థులు జూలై 13 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
◆ పోస్టుల వివరాలు :
- ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్- 80
- ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్- 40
- లైవ్క్ ఆఫీసర్- 06
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 05
- పబ్లిక్ ప్రాసిక్యూటర్- 23
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్- 86
- అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్ 1- 03
- అసిస్టెంట్ సర్వే ఆఫీసర్- 07
- ప్రిన్సిపల్ ఆఫీసర్- 01
- సీనియర్ లెక్చరర్ – 06
◆ మొత్తం పోస్టుల సంఖ్య: 261.
◆ అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
◆ ఎంపిక ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,
మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు చివరి తేదీ : జూలై 13 – 2023.
◆ వెబ్సైట్ : https://www.upsc.gov.in/