DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th AUGUST 2023

1) ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో 50 మీటర్ల మహిళల టీం ఈవెంట్ లో స్వర్ణం సాధించిన భారత షూటర్స్ ఎవరు.?
జ : తియాన‌, సాక్షి, కిరణ్‌దీప్ కౌర్

2) ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ రెండు స్థానంలో నిలిచింది. మొత్తం ఎన్ని పథకాలు సాధించింది.? చైనా మొదటి స్థానంలో నిలిచింది.
జ : 14 (6 G, 8 B)

3) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 జావలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరిన ముగ్గురు భారత క్రీడాకారులు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా, డీపీ మను, కిషోర్ జెనా

4) ఫీడే చెస్ ప్రపంచ కప్ 2023 గెలుచుకున్న మాగ్నస్ కార్లసన్ ఏ దేశానికి చెందిన ఆటగాడు .?
జ : నార్వే

5) థాయిలాండ్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : శ్రీతా తవీహమ్

6) ఖేలో ఇండియా మహిళ క్రీడలకు ఏమని నామకరణం చేశారు.?
జ : ASMITA khelo india Games

7) ASMITA విస్తరణ రూపం ఏమిటి.?
జ : Achieving Sports Milestone by Inspiring women Through Action

8) ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 10

9) అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : తమిళనాడు

10) వాగ్నర్ కిరాయి సైన్యం నేత ప్రిగోజిన్ మరణంతో ఆ సైన్య భాధ్యతలు ఏవరు చేపట్టారు.?
జ : అండ్రీ ట్రోషేవ్ (సిడాయ్)

11) గ్రేస్ దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్” నో పొందిన మొదటి విదేశీ నేత ఎవరు.?
జ : నరేంద్ర మోడీ

12) ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి.?
జ : ఇండోర్, సూరత్, ఆగ్రా

13) ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డుల్లో పారిశుద్ధ్య విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన నగరం ఏది.?
జ : కాకినాడ

14) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 సెమీఫైనల్ కం చేరిన భారత ఆటగాడు ఎవరు.?
జ : హెచ్ ఎస్ ప్రణయ్

15) పెంపుడు జంతువుల కు సంబంధించిన ఆహార పదార్థాల తయారు చేసే ఏ కంపెనీ తెలంగాణలో 800 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలు విస్తరించనుంది.?
జ : మార్స్

16) ‘భారత్ లో పక్షుల స్థితి’ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం గత 30 ఏళ్లలో ఎంత శాతం పక్షుల సంఖ్య క్షీణించింది.?
జ : 60%

17) ఇటీవల పార్లమెంట్ భవన్లో ప్రదర్శించబడిన చిత్రం ఏది?
జ : గదర్ – 2

18) బ్రిక్స్ సమావేశాల సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసో కు మోడీ అందించిన తెలంగాణకు సంబంధించిన బహుమతి ఏది.?
జ : సురాహి కూజాలు