BTech : సెప్టెంబర్ 4 నుంచి ఫస్టియర్ తరగతులు

హైదరాబాద్ (ఆగస్టు 26) : తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ మొదటి సెమిస్టర్ తరగతులు సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభించాలని (Btech First Year classes starts from September 4th 2023) JNTU నిర్ణయించింది. ఈ మేరకు బీటెక్ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్ల అకడమిక్ క్యాలెండర్ ను అధికారులు విడుదల చేశారు.

ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఇండక్షన్ ప్రోగ్రాంను నిర్వహించాలని సూచించారు. రెండో సెమిస్టర్ తరగతులు 2024 ఫిబ్రవరి 12 నుంచి (Btech second semester classes starts from February 2024) నిర్వహిస్తామని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ తెలిపారు.