DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th APRIL 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 24th APRIL 2023

1) ఐరాస నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా ఎంతకు చేరుతుంది.?
జ : 100 కోట్ల లోపు

2) భారత హాకీ జట్టు స్పాన్సర్ గా 2033 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉండనుంది.?
జ : ఒడిశా

3) సచిన్ టెండుల్కర్ 50వ పుట్టినరోజు పురస్కరించుకొని ఏ క్రికెట్ గ్రౌండ్ లోని ఒక గేటుకు అతని పేరు పెట్టారు.?
జ : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఆస్ట్రేలియా)

4) సుడాన్ లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ కావేరి

5) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సంస్థ నివేదిక ప్రకారం 2021 – 22 సంవత్సరంలో అత్యధిక రాజకీయ విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీ ఏది.?
జ : తెరాస (40 కోట్లు)

6) స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ప్లీజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికి సైనిక వ్యయంలో భారత్ ఎన్నో ర్యాంకులో ఉంది.?
జ : నాలుగవ స్థానం (అమెరికా, చైనా, రష్యా తర్వాత)

7) జీరో షాడో డే భారతదేశంలో ఏ నగరంలో ఈ సంవత్సరం కనబడనుంది.?
జ : బెంగళూరు

8) గురుత్వాకర్షణ మూలాలను గుర్తించేందుకు 2,600 ఓట్లతో మహారాష్ట్రలో భారత్ స్థాపించనున్న అబ్జర్వేటరీ పేరు ఏమిటి.?
జ : LIGO ( లేజర్ ఇంటర్ పెరోమీటర్ గ్రావిటేషనల్ వేర్ అబ్జర్వేటరీ)

9) గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ నివేదిక ప్రకారం గత 20 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రీన్ కవర్ పెరిగింది.?
జ : 13.09 కోట్ల హెక్టార్లలో

10) గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది.?
జ : ప్రపంచ వాతావరణ సంస్థ

11) చెత్తను మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని దక్షిణ భారతదేశంలో మొదట ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : హైదరాబాద్

12) COPE 2023 పేరుతో వాయు సేన సైనిక విన్యాసాలు భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహించింది.?
జ : అమెరికా

13) సుప్రీం కోర్ట్ ఏ తీర్పు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వెబ్ పేజీని ఆవిష్కరించింది.? జ : కేశవ నంద భారతి కేసు