DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd AUGUST 2023
1) ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2023 గెలుచుకున్న స్పెయిన్ మహిళల జట్టు… పురుషుల మరియు మహిళల ప్రపంచ కప్ లు గెలుచుకున్న ఏ జట్టు సరసన నిలిచింది.?
జ : జర్మనీ
2) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఆసియాలో అతిపెద్దదైన తులీఫ్ ఉద్యానవనం ఏది?
జ : ఇందిరా గాంధీ స్మారక తులిఫ్ ఉద్యానవనం – జమ్మూకాశ్మీర్
3) 2050 నాటికి ప్రపంచంలో ఎంతమంది జనాభా కీళ్ల వ్యాధితో బాధపడతారని లాన్సెట్ నివేదిక తెలుపుతుంది.?
జ : 100 కోట్లు
4) జనవరి 1 – 2023 నాటికి భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.?
జ : 94.50 కోట్లు
5) 1951 లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.?
జ : 17.32 కోట్లు
6) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నూతన చైర్ పర్సన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : జస్టిస్ ప్రకాష్ శ్రీ వాస్తవ
7) 15వ బ్రిక్స్ సమావేశాలు ఆగస్టు 22న ఎక్కడ ప్రారంభమయ్యాయి.?
జ : జోహెన్నస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా)
8) సెప్టెంబర్ 1 నుండి జీఎస్టీ రివార్డుల కోసం కేంద్రం తీసుకురామన్న కార్యక్రమం పేరు ఏమిటి?
జ : మేరా బిల్ మేరా అధికార్
9) చంద్రుని ధ్రువాల మీద ప్రయోగం కోసం ఇస్రో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) తతో కలిసి ఒప్పందం చేసుకుంది. ఆ మిషన్ పేరు ఏమిటి?
జ : లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ (LUPEX)
10) రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రచారకర్తగా ఎవరిని నియమించుకుంది.?
జ : సచిన్ టెండూల్కర్
11) పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది.?
జ : 2018 ఫిబ్రవరి – 01
12) యూరప్ లో అత్యంత ఎత్తైన అల్బ్రేస్ మంచు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ వ్యక్తి ఎవరు.?
జ : జయసింహ గౌడ్
13) సిన్సినాటి ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : కోకో గాఫ్ (కరోలినా ముకోవా పై)
14) 2300 సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించనుంది.?
జ : నంద్యాల జిల్లా అవుకు గ్రామం
15) గ్రామీణ భారతంలోని పాఠశాల విద్యార్థులు ఎంతమంది స్మార్ట్ ఫోన్ లు వినియోగిస్తున్నారు.?
జ : 49%
16) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అణు విద్యుత్ రియాక్టర్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : కాక్రాపర – గుజరాత్