DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th JUNE 2023
1) యాసెస్ 2023 మొదటి టెస్టులో ఏ జట్టు గెలిచింది.?
జ : ఆస్ట్రేలియా
2) హురూన్ భారతీయ ప్రైవేట్ సంస్థలు – 500 నివేదికలో అత్యంత విలువైన సంస్థ ఏది?
జ : రిలయన్స్ ఇండస్ట్రీస్
3) ఏ దేశం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.?
జ : ఎస్టోనియా
4) అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 21
5) టైటానిక్ నావను చూడడానికి వెళ్లిన ఏ జలాంతర్గామి కనిపించకుండా పోయింది.?
జ : టైటానిక్ సబ్ మెర్సిబుల్
6) యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కోసం తెలంగాణ నుండి ఇటీవల ఏ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.?
జ : నారాయణపేట జిల్లా నుండి నిలువురాళ్లు (మెన్హీర్ ప్రాంతం)
7) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : స్వామినాథన్ జానకి రామన్
8) గూగుల్ సంస్థ ఏ ఫోన్ లను భారత్ లో తయారు చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : గూగుల్ పిక్సల్
9) ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని ఏ ఐఐటీకి 315 కోట్లను దానంగా ఇచ్చారు.?
జ : ఐఐటీ బాంబే
10) తాజాగా ఏ దేశంలో దగ్గు మందు తాగి 12 మంది చిన్నారులు మరణించారు.?
జ : కామెరున్
11) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమిత్ అగర్వాల్
12) తెలంగాణలో ఎక్కడ వందే భారత్ మరియు మెట్రో కోచ్ ల తయారీ పరిశ్రమను జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.?
జ : రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామ సమీపంలో
13) దక్షిణాసియా ఫుడ్ బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఛాంపియన్ షిఫ్ 2023 ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : భారత్
14) బి డబ్ల్యు ఎఫ్ పురుషుల డబుల్స్ ర్యాంకింగులలో భారత జోడి అయిన సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడి ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం
15) జూనియర్ స్పీడ్ చెస్ టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : గుకేశ్
16) గ్లోబల్ చెస్ లీగ్ టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : దుబాయ్
17) టీ హబ్ ఏ దేశంతో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది.?
జ : మాల్దీవులు
18)కెనెడియన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ – 2023 విజేతగా నిలిచిన రేసర్ ఎవరు.?
జ : వెర్ స్టాఫెన్