DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th JANUARY 2023

1) 7.6 కేజీల భారీ ఉల్క ఇటీవల ఎక్కడ వెలకితీశారు.?
జ : అంటార్కిటికా ఖండంలో

2) తెలంగాణ ప్రాంతం నుండి ఇప్పటి వరకు ఎన్ని వస్తువులు/ ఉత్పత్తులు GI ట్యాగింగ్ పొందాయి.?
జ : 16

3) తెలంగాణ ఏర్పడిన తర్వాత GI ట్యాగింగ్ పొందిన వస్తువులు/ ఉత్పత్తులు ఎన్ని, ఏవి.?
జ : 6 ( పుట్టపాక తెలియా రుమాలు, బంగినపల్లి మామిడి, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దూరీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూరు కంది)

4) ఇటీవల ఉక్రెయిన్ దేశానికి 250 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన దేశం ఏమిటి.?
జ : అమెరికా

5) జాతీయ స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : AP – 10, TS – 08

6) 2020, 2021, 2022 సంవత్సరాలకు గాను ఎంతమంది బాలలకు సాహస బాలల పురస్కారాలను అందజేశారు.?
జ : 56 మంది

7) ఇటీవల తెలంగాణలో ఎక్కడ దీప స్తంభ శాసనాన్ని కనిపెట్టారు.?
జ : పాలకుర్తి (జనగామ)

8) అమెజాన్ సంస్థ దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది.?
జ : 16 వేల కోట్లు

9) శుక్ర గ్రహం పైకి ప్రయోగించనున్న “శుక్రయాన్ – 1” కార్యక్రమాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో చేపట్టనుంది.?
జ : 2031

10) ఇటీవల ఏ రాష్ట్రం ఉద్యోగులకు, పింఛన్ ధారులకు పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది.?
జ : హిమాచల్ ప్రదేశ్

11) ఏ దేశ ఉప ప్రధాని ఇటీవల భారత్ లో ఆకస్మికంగా మృతి చెందారు.?
జ : బదారా అల్హూ జూఫ్ (గాంభియా)

12) దావోస్ వేదికగా జనవరి 16 నుండి 20వ తేదీ వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎన్నవది.?
జ : 53వది

13) గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2022లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ: 68

14) దేశ సైనిక బలగాన్ని సూచించే “గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్2023” లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 4వ స్థానంలో (1 – అమెరికా, 2 – రష్యా, 3 – చైనా)

15) ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : కంటి వెలుగు పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

16) NDFR రైజింగ్ డే నూ ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 19

17) హరీష్ దామోదరన్ రాసిన ‘బ్రోక్ టూ బ్రేక్ త్రూ’ అనే పుస్తకం ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా రాశాడు. ఈ పుస్తకానికి గాజా క్యాపిటల్ బిజినెస్ బుక్ 2022 అవార్డు దక్కింది.?
జ : “హట్సన్ ఆగ్రో” స్థాపకుడు ఆర్. జి. చంద్రమొగాన్ జీవిత చరిత్ర

18) ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశం ఏది.?
జ : పాకిస్తాన్

19) మొట్టమొదటి “గ్లోబల్ టూరిజం ఇన్వెస్టింగ్ సమ్మిట్ 2023” ను ఏప్రిల్ మాసంలో ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : భారతదేశం

20) ఇండియా ఏ దేశానికి సామాజిక అభివృద్ధి కోసం 100 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : మాల్దీవ్స్

21) మాల్దీవులలోని ఏ నగరంలో భారత్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనుంది.?
జ : ఫోఖాయిదూ

Comments are closed.