DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th OCTOBER 2023

1) బంగ్లాదేశ్ తో జరిగిన వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎన్నో అంతర్జాతీయ వన్డే సెంచరీ నమోదు చేశాడు.?
జ : 48

2) అంతర్జాతీయ క్రికెట్లో 26వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ ( 567 ఇన్నింగ్స్ లలో)

3) అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఎన్నో స్థానానికి చేరాడు.?
జ : 4వ స్థానం

4) ఢిల్లీ – ఘజియాబాద్- మీరట్ మార్గాలలో ప్రవేశపెట్టనున్న సెమీ హై స్పీడ్ రైళ్లకు ఏమని నామకరణం చేశారు.?
జ : నమో భారత్ ఎక్స్ప్రెస్

5) 2014 – 2023 మధ్యలో బ్యాంకులం ఎంత మొత్తాన్ని రైట్ ఆఫ్ చేశాయి.?
జ : 25 లక్షల కోట్లు

6) 4.76 లక్షల ఏళ్ల నాటి చెక్కలను ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో గుర్తించారు.?
జ : జాంబియా

7) బెల్ట్ అండ్ రోడ్ ఇన్సియేషన్ (BRI) మూడో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది.?
జ : బీజింగ్ – చైనా

8) 2024 ఏప్రిల్ లో భూమికి అతి సమీపంగా రానున్న తోకచుక్క పేరు ఏమిటి.?
జ : 12P/PONS-BROOKS

9) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల జిఎస్టి ఎగవేసినట్లు జిఎస్టి కౌన్సిల్ తెలిపింది.?
జ : 1.36 ట్రిలియన్స్ రూపాయలు

10) ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు తొలి మహిళ బధిర అడ్వకేట్ ఎవరు.?
జ : సారా సన్నీ

11) సాంప్రదాయ ఔషధాలపై తొలి సదస్సు – 2023 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖలు ఎక్కడ నిర్వహించాయి.?
జ : గాంధీ నగర్

12) ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఆటగాడు కార్ల సన్ ను ఓడించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : కార్తికేయన్ మురళి

13) ఇటీవల పాకిస్తాన్ తన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించింది. దానికి ఏమని పేరు.?
జ : అబబీల్ ఆయుధ వ్యవస్థ

14) సాంప్రదాయ కులవృత్తుల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం పేరు ఏమిటి?
జ : జగనన్న చేదోడు