DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th OCTOBER 2023

1) ఐరాసలో భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆరీంధమ్ భాగ్చీ

2) అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరిత ఇంధన అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు ఏ దేశంతో చేతులు కలిపింది.?
జ : జపాన్

3) మీసోలిథిక్ యుగానికి చెందిన పెయింటింగ్ ను ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపెట్టారు.?
జ : మంచిరేవుల ఫారెస్ట్

4) మంచిరేవుల ఫారెస్ట్ నందు కనిపెట్టిన మీసోలితిక్ యుగానికి చెందిన పెయింటింగులో ఏ బొమ్మలు ఉన్నాయి.?
జ : మూడు తాబేళ్ళు, ఒక చేప బొమ్మ

5) ప్రపంచంలో సేవల విభాగంలో అత్యంత వృద్ధి కనబరిచిన నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : దుబాయ్

6) ఏ పేరుతో గోవా కాజు ఇటీవల భౌగోళిక గుర్తింపు (GI TAG) పొందింది.?
జ : కెర్నెల్

7) ప్రాజెక్ట్ నీలగిరి తార్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : తమిళనాడు

8) ఏం సంవత్సరంలో ఒలంపిక్స్ నిర్వహించడానికి భారతదేశం బిడ్ వేసింది.?
జ : 2036

9) మణిపూర్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సిద్ధార్థ మృదుల్

10) సత్యజీత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2023ను ఏ నటుడుకి కేంద్రం ప్రకటించింది.?
జ : మైకెల్ డగ్లస్ (హాలీవుడ్)

11) జాతీయ విద్యార్థి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 15

12) అక్టోబర్ 15న జాతీయ విద్యార్థి దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

13) హాంగ్జౌ నగరంలో నిర్వహించిన 19వ ఆసియా క్రీడల ఆరంభ వేడుకల థీమ్ ఏమిటి.?
జ : టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏసియా

14) ఈక్వేడర్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
ద : డేనియల్ నోబోవా

15) ఇటీవల కన్నుమూసిన భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎవరు.?
జ : ఎంఎస్ గిల్

16) ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎవరు.?
జ : రాజీవ్ కుమార్

17) యువతలో ఎన్నికల పట్ల అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆవిష్కరించిన కార్టూన్ పుస్తకం పేరు.?
జ : చాచా చౌదరి ఔర్ చునావి చుంగల్

18) ఏ దేశంలో ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు.?
జ : వియత్నం

19) అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు.?
జ : థామస్ బాక్

20) లాన్సెట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం 2050 నాటికి పక్షవాతంతో సంవత్సరానికి ఎన్ని మరణాలు సంభవించనున్నాయి.?
జ : కోటి

21) 2023 మిస్ యూనివర్స్ పోటీలలో పోటీపడుతున్న ట్రాన్స్ జెండర్లు ఎవరు.?
జ : మారీనా మాచెట్, రికీ కొల్లే