AP JOBS : ఏపీ వర్శిటీలలో 3,282 ఉద్యోగాల భర్తీకి 20న నోటిఫికేషన్

విజయవాడ (అక్టోబర్ – 17) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న నోటిఫికేషన్ విడుదల (assistant professor jobs in ap universities) చేస్తామని ఉన్నత విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ అధ్యాపకులకు 10 శాతం మార్కులు వెయిటేజీ ఇస్తామని తెలిపింది. దీంతో యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న అధ్యాపకులకు మేలు జరగనుంది.

ఈ ఉద్యోగాల భర్తీ సమయంలో 1:12 మంది చొప్పున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. అలాగే యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీల భర్తీ కోసం చర్యలు చేపట్టనున్నారు.