DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th JUNE 2023

1) సముద్రంలో తీరం దాటి గుజరాత్ ముంబై ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న తుఫాను పేరు ఏమిటి?
జ : బీపర్‌జాయ్

2) 2023 మే మాసానికి భారత వాణిజ్య లోటు ఎంతగా నమోదయింది.?
జ : 1,81,384 కోట్లు

3) 2023 మే మాసంలో భారత ఎగుమతులు ఎంత శాతం తగ్గాయి.?
జ : 10.3%

4) మోడీ సంస్థ నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.2%

5) శుద్ధి చేసిన సోయాబీన్, పొద్దు తిరుగుడు వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ఎంతకు తగ్గించింది.?
జ : 12.5% (17.5% నుండి)

6) గడచిన దశాబ్ద కాలంలో వైద్య పర్యాటకం ద్వారా భారత్ కు ఎంత ఆదాయం సమకూరింది.?
జ : 60,833 కోట్లు

7) సహజ సిద్ధమైన ఇన్సులిన్ ఏ మొక్క నుండి ఉత్పత్తి చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : లెట్యూస్

8) ఇటీవల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఓరల్ పోలియో వ్యాక్సిన్ ల పేరు ఏమిటి.?
జ : నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ – 1 & 3 (NOPV -1 & NOPV -3)

9) ప్రాణత్యాగం చేసిన ఐరాస శాంతి పరిరక్షకు దళ సైనికులకు ఎక్కడ స్మారక స్థూపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు..?
జ : ఐరాస కార్యాలయంలో

10) భారతదేశంలో ఏ డ్రోన్ ల కొనుగోలుకు అమెరికా తో ఒప్పందం చేసుకోనుంది.?
జ : MQ-9B

11) ఏ రాష్ట్ర ప్రభుత్వం మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : కర్ణాటక

12) 4వ జాతీయ జలశక్తి అవార్డుల్లో దేశంలోనే ఉత్తమ పంచాయతీగా నిలిచిన తెలంగాణకు చెందిన గ్రామపంచాయతీ ఏది.?
జ : జగన్నాధపురం (భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా)

13) 4వ జాతీయ జలశక్తి అవార్డుల్లో దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా నిలిచిన మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
జ : 1. మద్యప్రదేశ్, 2. ఒడిశా, 3. ఆంధ్రప్రదేశ్ & బీహర్

14) 4వ జాతీయ జలశక్తి అవార్డుల్లో దేశంలోనే ఉత్తమ జిల్లా గా మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ కు చెందిన జిల్లా ఏది.?
జ : ఆదిలాబాద్

15) చంద్రయాన్ – 3 ప్రయోగం ఏ రోజున చేపట్టనున్నారు.?
జ : జూలై – 12

16) అమెరికన్ సర్జికల్ అసోషియేషన్ అందించే ప్రతిష్టాత్మక ఫెలోషిప్ కు ఎంపికైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంకాలజిస్ట్ ఎవరు.?
జ : డా. రఘురాం పిల్లరిశెట్టి

17) వింబుల్డన్ ప్రైజ్ మనీ ని 11% పెంచడంతో ఎంతకు చేరింది.?
జ : 464 కోట్లు

18) చంద్రుని పై నీటి జాడలు కోసం భారత్ జపాన్ తో కలిసి చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : లూపెక్స్ మిషన్