DAILY CURRENT AFFAIRS IN TELUGU 15th AUGUST 2023
1) భారత స్వతంత్ర దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : NATION FIRST – ALWAYS FIRST
2) ఇటీవల భారత పౌరసత్వం పొందిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఎవరు.?
జ : అక్షయ్ కుమార్
3) రుణ దాతలు సులభంగా రుణాన్ని పొందేందుకు “పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్” పేరుతో డిజిటల్ సమాచారాన్ని ఏ సంస్థ ఆగస్టు 17 నుండి అందించనుంది.?
జ : రిజర్వు బ్యాంక్ ఆఫ్
4) ఢిల్లీ ప్రగతి మైదాన్ లో “భారత్ మండపం” పేరుతో నిర్మించిన భవనం “అంతర్జాతీయ ప్రదర్శనశాల సమావేశం మందిరం” ఏ నిర్మాణాన్ని ఆధారంగా నిర్మించారు.?
జ : 12వ శతాబ్దపు బసవేశ్వరుడి అనుభవ మండపం
5) దేశంలో డ్రోన్ల వినియోగ సంఖ్యలో ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది.?
జ : తమిళనాడు (రెండవ స్థానం మహారాష్ట్ర, మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్)
6) హార్వార్డ్ యూనివర్సిటీ అందించే ప్రతిష్టాత్మక “జార్జి లెడ్లీ అవార్డు”కు ఎన్నికైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : రాజ్ చెట్టి
7) 50 మీటర్ల వరకు లక్ష్యాన్ని చెధించగల దేశీయంగా తయారుచేసిన రివాల్వర్ పేరు ఏమిటి.?
జ : ప్రబల్
8) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిగా సముద్ర మట్టానికి 19,400 అడుగుల ఎత్తులో నిర్మాణానికి తూర్పు లడాక్ లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టింది. అది ఏ ప్రాంతాలను కలుపుతుంది.?
జ : లికారు – మిగ్ లా – పుక్చే
9) 1970 ఆసియా గేమ్స్ లో భారత్ కు ఫుట్బా బాల్ క్రీడలో కాంస్య పతకం నెగ్గిన జట్టు సభ్యుడు. ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి?
జ : మహమ్మద్ హబీబ్
10) బంగ్లాదేశ్ జాతీయ కబడ్డీ కోర్టుగా నియమితుడైన తెలంగాణకు చెందిన కోచ్ ఎవరు.?
జ : శ్రీనివాస్ రెడ్డి
11) సులబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరణించారు ఆయన పేరు ఏమిటి.?
జ : బిందేశ్వర్ పాఠక్
12) బిందెశ్వర్ పాఠక్ కు ఏమని బిరుదు ఉంది.?
జ : టాయిలెట్ మ్యాన్ ఆప్ ఇండియా
13) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న తెలంగాణ మంత్రి ఎవరు.?
జ : చామకూర మల్లారెడ్డి
14) తెలంగాణ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత .?
జ : 2,126 యూనిట్లు
15) ఆపిల్ సంస్థ ఇయర్ బడ్స్ ను హైదరాబాదులో ఏ సంస్థ తయారు చేయనుంది.?
జ : ఫాక్స్‌కాన్
16) జూలై – 01 – 2023 నాటికి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య ఎంత.?
జ : 69,766