1) ఐపీఎల్ 2023లో సెంచరీ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ ఎవరు. ఇతను ఈ ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఐదవ బ్యాట్స్మెన్.?
జ : ప్రభు సిమ్రన్
2) కెనడా అమెరికా తర్వాత సొంతంగా వంటకం కెమెరాను తయారు చేసుకున్న దేశంగా ఇటీవల ఏ దేశం నిలిచింది.?
జ : చైనా
3) భారతదేశపు తొలి క్లోనింగ్ ఆవు దూడ పేరు ఏమిటి?
జ : గంగా
4) వేసవి కాలంలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నీటి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.?
జ : కేరళ
5) ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఉక్రెయిన్
6) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజాస్వామ్య చరిత్ర గురించి మాట్లాడుతూ ఏ శాసనం గురించి ప్రస్తావించారు.?
జ : ఉత్తర మేరూర్ శాసనం
8) పౌర విమానయాన శాఖ ఇటీవల ఉడాన్ 5.0 పథకాన్ని ప్రారంభించింది. UDAN ను విస్తరించండి.?
జ : ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్
9) ఉత్తర భారత దేశంలో తొలిసారిగా అను విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది.?
జ : గోరఖ్ పూర్ – హర్యానా
10) ‘ఉత్కల్ దివస్’ అనే పేరుతో ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటారు.?
జ : ఒడిశా
11) ప్రపంచ అటిజం దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 2
12) అంగన్వాడి పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
జ : పోషన్ బి – పఢా బి