DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th AUGUST 2023

1) 2021 – 22 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ ఎంత.?
జ : 1,83,569 కోట్లు

2) భారత్ లో మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఎంత శాతం మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు.?
జ : 27.3%

3) భారత్ భూ భాగంలో మొత్తం ఎంత శాతం భూభాగంలో తీవ్ర వరదలకు గురయ్యే ఆస్కారం ఉందని వరదలపై ఏర్పాటైన కమిషన్ తెలిపింది.?
జ : 12% (40 మిలియన్ హెక్టార్లు)

4) 2023 మార్చి నాటికి క్రెడిట్ కార్డుల ఎగవేత విలువ ఎంత ఎంతగా ఉంది.?
జ : 4,072 కోట్లు

5) 2023 మార్చి 31 నాటికి దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఎవరు క్లైయిమ్ చేసుకోని సొమ్ము ఎంతగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 48,461.44 కోట్లు

6) ఇప్సాస్ నివేదిక ప్రకారం భారత దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి?
జ : ద్రవ్యోల్బణం (రెండవది నిరుద్యోగం)

7) అమెరికాలోని హవాయి దీపంలోని ఏ నగరం కార్చిచ్చు కారణంగా పూర్తిగా దగ్ధమైంది.?
జ : లా హైనా

8) పాకిస్తాన్ దేశపు తాత్కాలిక, ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అన్వర్ ఉల్ హఖ్ కాకర్

9) తెలంగాణలో ఎక్కడ ఎకో థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : కొత్తగూడ

10) హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ: భారత్ (మలేషియా పై)

11) హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ 2023 విజేతగా నిలిచిన భారత్ కు ఇది ఎన్నో టైటిల్.?
జ : నాలుగవది

12) తెలంగాణ ఆర్టీసీ సంస్థ బస్సులను ట్రాక్ చేయడానికి ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏమిటి.?
జ : TSRTC GAMYAM

13) నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (NSDP) లో కేంద్ర గణాంకాల ప్రకారం తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ (3,08, 732)

14) నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (NSDP) అంటే ఏమిటి.?
జ : ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ఒక పౌరుడు సాదించిన ఉత్పాదకత

15) తెలంగాణ రాష్ట్రంలో పాక్స్ కాన్ సంస్థ ఎన్ని వేలకోట్ల పెట్టుబడితో తన పరిశ్రమను విస్తరించనుంది.?
జ : 4,562 కోట్లు

16) IPC 1860 స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బిల్లు పేరు ఏమిటి?
జ : భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023

17) CRPC – 1898 చట్టం స్థానంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు పేరు ఏమిటి?
జ : భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) – 2023

18) EVIDENCE ACT – 1872 స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు పేరు ఏమిటి.?
జ : భారతీయ సాక్ష్య (BS) – 2023