DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th JUNE 2023

1) ఫ్రెంచ్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు కైవసం చేసుకున్నారు.?
జ : నోవాక్ జకోవిచ్ (కాస్పర్ రూడ్ పై)

2) నోవాక్ జకోవిచ్ ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గారు.?
జ : 23

3) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : ఆస్ట్రేలియా (భారత్ పై)

4) మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2023ను గెలుచుకున్న జట్టు ఏది?
జ : భారత్ (దక్షిణ కొరియా పై)

5) జాతీయస్థాయిలో పాఠశాల విద్యలో డ్రాపౌట్బ్ శాతం ఎంత.?
జ : 12 శాతం

6) ఏ రాష్ట్రంలో అత్యధికంగా పాఠశాల విద్య లో డ్రాపౌట్స్ జరుగుతున్నాయి.?
జ : మేఘాలయ

7) మాజీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి టిఎన్ శేషన్ ఆత్మకథ పేరు ఏమిటి మ.?
జ :త్రూ ద బ్రోకెన్ గ్లాస్

8) సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.*
జ: నితిన్ అగర్వాల్

9) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నోవాక్ జకోవిచ్ ( 36 సంవత్సరాల 20 రోజులు)

10) అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : ఆస్ట్రేలియా (మొత్తం తొమ్మిది ఐసీసీ ట్రోఫీలు)

11) డెన్మార్క్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ 2023 గెలుచుకున్న మిక్స్డ్ డబుల్స్ జోడి ఏది?
జ : సిక్కిరెడ్డి -రోహన్ కపూర్

12) మూడీస్ సంస్థ నివేదిక ప్రకారం జూన్ 2023 త్రైమాసికంలో భారత వృద్ధి రేటు ఎంత .?
జ : 6 నుండి 6.3 శాతం

13) ఇటీవల జపాన్ లోని ఏ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.?
జ : హోక్కయిడో

14) సెప్టెంబర్ 16, 17న అంతర్జాతీయ న్యాయ సదస్సు ఏ నగరంలో జరగనుంది..?
జ : హైదరాబాద్

15) 5 వేల మీటర్ల పరుగును 14 నిమిషాలు 5.2 సెకండ్లలో అదిగమించి ప్రపంచ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు.?
జ : ఫెయిత్ కెప్యేగాన్ (కెన్యా)

16) ఆసియా కప్ ఆర్చరీ 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది..?
జ : 5వ స్థానంలో (దక్షిణ కోరియా – 1)

17) సూర్యుడు పై అధ్యయనం కోసం నాసా పంపిన ఏ స్పేస్ క్రాప్ట్ సూర్యుడి దగ్గరకు చేరినట్లు నాసా ప్రకటించింది..?
జ : పార్కర్ సోలార్ ప్రోబ్

1ఫిపా అండర్ – 20 వరల్డ్ కప్ 2023 గెలుచుకున్న జట్టు ఏది.?
జ : ఉరుగ్వే (ఇటలీ పై)