DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th AUGUST 2023

1) 2023 కు గాను భారత పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 3.7%

2) కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపన్నులు ఏ పన్నుల విభాగంలోకి వస్తాయి.?
జ : ప్రత్యక్ష పన్నులు

3) హపర్ హెచ్‌క్యూ నివేదిక ప్రకారం ఇంస్టాగ్రామ్ లో అత్యధిక వేతనం పొందుతున్న మొదటి ముగ్గురు క్రీడాకారులు ఎవరు?
జ : రోనాల్డో, మెస్సి, కోహ్లీ.

4) కేంద్ర ప్రభుత్వం ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నూతన చట్టాలను ప్రవేశపెట్టడానికి బిల్లులను ప్రవేశపెట్టింది.?
జ : ఐసీసీ, సిఆర్పిఎఫ్, సాక్షాదారాల చట్టం

5) ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎంపికైంది.?
జ : సీతారామం

6) అంతర్జాతీయ హాకీలో 300 మ్యాచులు పూర్తి చేసుకున్న భారత గోల్ కీపర్ ఎవరు.?
జ : పీఆర్ శ్రీజేష్

7) ఇటీవల శాస్త్రవేత్తలు ఐదవ శక్తి పదార్థాన్ని కనిపెట్టారు దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : మ్యుయాన్స్

8) తెలంగాణలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు ఇటీవల పర్యావరణ అనుమతి లభించింది.?
జ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

9) ఏ రాష్ట్రం అన్ని గిరిజన ఆవాసాలకు స్వచ్ఛమైన నల్లా నీటిని సరఫరా చేస్తుందని కేంద్రం ప్రకటించింది.?
జ : తెలంగాణ

10) హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ – మలేషియా

11) అమెరికాలో 2022 సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక తెలుపుతుంది.?
జ : 49 వేలకు పైగా

12) హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది?
జ : సింగపూర్

13) ఏ ఆహార పంట ధరల ఎత్తుతగ్గులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరేడియేషన్ సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఉల్లిపాయలు

14) ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల జాబితాలో 2021వ సంవత్సరానికి భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 8వ స్థానం

15) కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం పట్టణ పల్లె ప్రాంతాలలో ఇంటర్నెట్ వినియోగ శాతం ఎంత.?
జ : పట్టణాలు – 67% ,పల్లెలు – 31%

16) దాదాపు ఏడు దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చిరుతపులులను తిరిగి భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఏ దేశాల నుండి 20 చిరుతపులను ప్రాజెక్టు చీతా ప్రాజెక్టు కింద తీసుకువచ్చారు.?
జ : నమీబియా‌, దక్షిణాఫ్రికా

17) ఏ గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది.?
జ : శని (145)

Comments are closed.