DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 10th JUNE 2023

1) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరు పుతిన్ ఏ ప్రాంతంలో అణ్వాయుధాలను జులైలో మొహరించనున్నట్లు తెలిపారు.?
జ : బెలారస్

2) 2030 వరకు ఒక బిలియన్ యూరోల వాణిజ్యాన్ని ఇరుదేశాల మధ్య సాధించాలని భారత రాష్ట్రపతి ఏ దేశ అధ్యక్షుడితో ఒప్పందం చేసుకున్నారు.?
జ : సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉకిక్

3) గల్ఫ్ ఆఫ్ ఓమన్ లో భారత నావికాదళం ఏ దేశ నావికా దళాలతో నావికా విన్యాసాలను చేపట్టింది.?
జ : ఇండియా – ప్రాన్స్ – యూఏఈ

4) భారతీయులు విదేశాలలో ఉపయోగించడానికి వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఏ కార్డును జారీ చేయడానికి అధికారం కల్పించింది.?
జ : ప్రీపెయిడ్ రూపే ఫారెక్స్ కార్డ్

5) హార్వార్డ్ యూనివర్సిటీ ఫైనాన్స్ అండ్ సి ఎఫ్ ఓ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా నియమితురాలైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : రీతూ కర్లా

6) యూపీఐ ఆధారిత క్యాష్ విత్ డ్రాయల్ పద్ధతిని ఏటీఎంలో ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది.?
జ : బ్యాంక్ ఆఫ్ బరోడా

7) భారతదేశంలో 2023కు గానూ అత్యంత జీవన వ్యయం గల నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : ముంబై

8) క్రికెట్ వరల్డ్ కప్ మరియు ఆసియా కప్ లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.?
జ : డిస్నీ హాట్ స్టార్

9) మెటా సంస్థ ఫేస్ బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లకు నెలకు ఎంత చెల్లించడం ద్వారా బ్లూ టిక్ పొందవచ్చని పేర్కొంది.?
జ : ₹ 699/-

10) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : జనార్దన్ ప్రసాద్

11) మూడవ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?
జ : వారణాసి

12) ఏ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు మొదటి 100 యూనిట్ల విద్యుత్ వినియోగానికి పూర్తిగా చార్జీలను ఎత్తివేసింది.?
జ : రాజస్థాన్

13) యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినా సిటీ ఆఫ్ డెడ్ ఏ దేశంలో ఉంది.?
జ : ఈజిప్ట్

14) ఏ ఆరోపణల నేపథ్యంలో ఎంపీ పదవికి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు.?
జ : పార్టీగేట్ ఆరోపణలు

15) 2023 మే మాసంలో భారత నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 7.7%

16) డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానం

17) ఐరాస నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం మంది వంట ఉండటానికి హానికర రసాయనలను ఉపయోగిస్తున్నారు.?
జ : 25%

18) అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను పేరు ఏమిటి.?
జ : బిపోర్ జాయ్

19) ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
జ : ఇగా స్వైటెక్ (ముచోవాపై)

20) ఫ్రెంచ్ ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ విజేత ఎవరు.?
జ : డోడిగ్ – క్రాజెక్ జోడి