1) ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (142.3 కోట్లు)
2) న్యూజిలాండ్ తో జరిగిన హైదరాబాద్ వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన భారత బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : శుభమన్ గిల్ (210)
3) భారత తరఫున అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : శుభమన్ గిల్ (19 ఇన్నింగ్స్ లలో)
4) జనవరి 18 – 2023 తో భారత పార్లమెంటు భవనానికి ఎన్ని సంవత్సరాలు పూర్తికానున్నాయి.?
జ : 96 ఏళ్ళు
5) 1927 జనవరి 18న పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ ఇర్విన్
6) కంటి వెలుగు – 2 కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు.?
జ : ఖమ్మం
7) ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ప్రాన్స్ కు చెందిన మహిళ ఇటీవల మృతి చెందారు. ఆమె పేరు ఏమిటి.?.
జ : లూసిల్ రాండన్ (118 ఏళ్ళు)
8) వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణలో 2000 కోట్లతో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయ దానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : భారతి ఎయిర్ టెల్
9) భారతదేశంలోని ఏ రాష్ట్రం పిల్లలను కంటే ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించింది.
జ : సిక్కిం
10) పిడుగుల నుంచి రక్షణ కోసం ఏ దేశపు శాస్త్రవేత్తలు లైటింగ్ రాడార్లను అభివృద్ధి చేశారు.?
జ : స్విట్జర్లాండ్
12) సాంకేతిక వినియోగంలో ఉత్తమ ఎయిర్ పోర్ట్ 2023గా అవార్డు దక్కించుకున్న ఎయిర్ పోర్ట్ ఏది?
జ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (హైదరాబాద్)
13) ఇటీవల శాస్త్రవేత్తలు “సాలిటరీ తరంగాలను” ఏ గ్రహంపై కనిపెట్టారు.?
జ : అంగారక గ్రహం
14) ఇటీవల ప్రధాని మోడీ పర్యాటకుల కోసం టెంట్ సిటీని ఏ నది ఒడ్డున ప్రారంభించారు.?.
జ : గంగానది (వారణాసి)
15) G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : కేరళ
16) భారతదేశంలో “మొదటి రాజ్యాంగ అక్షరాస్యత పొందిన జిల్లా”గా ఏ జిల్లా నిలిచింది.?.
జ : కోల్లాం (కేరళ)
17) స్పానిష్ సూపర్ కప్ ఫుట్ బాల్ టైటిల్ 2023ను గెలుచుకున్న జట్టు ఏది.?
జ : బార్సిలోనా (రియల్ మాడ్రిడ్ పై)
Comments are closed.