CURRENT AFFAIRS IN TELUGU 4th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 4th MARCH 2023

1) మెర్కామ్ నివేదిక ప్రకారం 2022 లో భారత్ లో సౌర విద్యుత్ సామర్థ్యం ఎంత శాతంగా నమోదు అయింది.
జ : 13%

2) అత్యంత చిన్న వయసులో ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాలైన కిలిమంజారో‌, మేరు పర్వతాలను అధిరోహించిన బాలికగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సియోన్నా చోప్రా (ఆరున్నర సంవత్సరాలు) – పంజాబ్

3) సంతోష్ ట్రోఫీ – 2023 ఫుట్ బాల్ కప్ ను ఏ జట్టు కైవసం చేసుకుంది.?
జ : కర్ణాటక (మేఘలయా పై)

4) భారత్ లో తయారైన దగ్గు మందుల కారణంగా గాంబియా దేశంలో చిన్నారులు మరణించారు. ఆ దగ్గు మందుల్లో ఉన్న కలుషిచ రసాయనం ఏమిటి.?
జ : డై ఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్

5) భూగోళం వేడెక్కడం వల్ల 2100 సంవత్సరం నాటికి ఏ నగరాలకు మునిగిపోయో ముంపు పొంచి ఉందని అంచనా.?
జ : చెన్నై, కోల్‌కతా

6) మార్చి 8 నుండి 11 వరకు ఏ దేశ ప్రధాని భారత్ ను సందర్శించనున్నారు.?
జ : ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్

7) రష్యా కు చెందిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ – వి’ తయారీ చేసినా శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇటీవల హత్య కు గురయ్యారు.
ఆయన పేరు ఏమిటి.?
జ : అండ్రీ బోటికోవ్

8) ప్రపంచంలో తొలిసారిగా ఎక్కడ హైవే పక్కన వెదురుతో నిర్మించిన బారియర్ ను ఏర్పాటు చేశారు.?
జ : వాణీ – వరోరా హైవే పై 200 మీటర్లు

9) ఏ దేశ పార్లమెంటు ను ఉద్దేశించి రాహుల్ గాంధీ మార్చి 6వ తేదీన ప్రసంగించనున్నారు.?
జ : బ్రిటిష్ పార్లమెంట్

10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.?
జ : 13.41 లక్షల కోట్లు

11) హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ లో 1,000 కోట్లతో ఫ్రాన్స్ కు చెందిన ఏ ఔషధ తయారీ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుంది.?
జ : యూరోఫిన్స్

12) ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారు.?
జ : వెయ్యి కోట్లు

13) డీజిల్ ఎగుమతులపై రెండు ఫాల్ ట్యాక్స్ ను కేంద్రం ఎంత తగ్గించింది.?
జ : 50 పైసలు (2.50 నుంచి 2.00 కు)

14) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2022 అవార్డు ఏ సంస్థకు దక్కింది.?
జ : BEL – హైదరాబాద్

15) బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏది?
జ : సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థ

16) సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు దేశంలోనే తొలిసారిగా “జీరో ఫీ బ్యాంకింగ్” సేవలను ఏ బ్యాంక్ ప్రకటించింది.?
జ : ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

17) 2030 నాటికి భారత్ సౌర, పవన, అణు‌, బయోమాస్, జల వనరుల ద్వారా ఎంత మేర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 500 గిగా వాట్లు