CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2023

1) ఏ నిజం రాజు వర్మానాలతో కూడిన పుస్తకాన్ని ఇటీవల ఇరాన్ రాయబారి హైదరాబాదులో ఆవిష్కరించారు.?
జ : ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

2) 2022 నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన అలెస్ బియాలియోట్ స్కీ కు ఏ దేశం పదేళ్ల కారగార శిక్షను విధించింది.?
జ : బెలారస్

3) భారత పురుషుల ఆకీ జట్టు ప్రధాన కోచ్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : క్రెయిగ్ పుల్టన్ (దక్షిణాఫ్రికా)

4) మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
జ : కాన్రాడ్ సంగ్మా

5) ఏప్రిల్ ఒకటి నుండి ఏ రాష్ట్రం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనుంది.?
జ : హిమాచల్ ప్రదేశ్

6) ‘గ్లోబల్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ అవార్డును 2023’ ను ఎంపికైన భారతీయ ఆర్థిక వేత్త ఎవరు.?
జ : జయతీ ఘోష్

7) పౌర విమానయాన పరిశోధన కేంద్రాన్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో

8) అటవీ అధికారుల తాజా లెక్కల ప్రకారం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎన్ని చిరుత పులులు ఉన్నాయి.?
జ : 25

8) ఏ థర్మల్ పవర్ స్టేషన్ కు కేంద్రం బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు లభించింది.?
జ : సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్

9) సి ఆర్ పి ఎఫ్ సదరన్ సెక్టార్ కు తొలి మహిళ ఐజీపీ గా ఎంపికైనది ఎవరు.?
జ : చారుసిన్హా

10) మార్చి 6,7వ తేదీలలో జీ20 దేశాల ,గ్లోబల్ పార్ట్నర్ షిప్ ఫర్ ఫైనాన్స్ ఇంక్లూజివ్, సదస్సు ఏ నగరంలో జరగనుంది.?
జ : హైదరాబాద్

11) తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తారీక్ అన్సారి

12) ఆసియా చెస్ సమాఖ్య అవార్డుల 2022లో ఉత్తమ మహిళా జట్టుగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత మహిళల జట్టు

13) ఆసియా చెస్ సమాఖ్య అవార్డుల 2022లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : దొమ్మరాజు గుకేష్

14) వెనుకబడిన తరగతులు బిసి ల స్థితిగతులపై ఏ రాష్ట్రం సర్వే చేపట్టనుంది.?
జ : ఒడిశా (మొదటి రాష్ట్రం బీహార్)

15) కరోనా కట్టడిలో విజయవంతమైనందుకు గుర్తింపుగా పోర్టర్ ప్రైజ్ 2022 ఏ దేశానికి లభించనుంది.?
జ : భారత్

16) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ (689) (కుంబ్లే – 953, హర్బజన్ – 707)

17) జాతీయ లాంగ్ జంప్ పోటీలలో 8.42 మీటర్లు దూకి కొత్త జాతీయ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : జస్విన్ ఆల్డ్రిన్ (తమిళనాడు)

18) మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) క్రికెట్ పోటీలకు మస్కట్ గా దేనిని బీసీసీఐ దేనిని ఎంపిక చేసింది.?
జ : శక్తి

19) ఆదాని గ్రూప్ అవకతవకలపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.?
జ : జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

20) ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ అయిన ఫాక్స్‌కాన్ సంస్థ ఏ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది.?
జ : తెలంగాణ