CURRENT AFFAIRS IN TELUGU 17th FEBRUARY 2023
1) 3వ ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 భారత్ తొలిసారి క్వార్టర్స్ ఫైనల్స్ కు చేరింది. ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది.?
జ : దుబాయ్
2) ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో 100వ టెస్టు ఆడుతున్న పూజారా… భారత్ తరపున వందో టెస్ట్ ఆడుతున్న ఎన్నో క్రికెటర్ గా నిలిచారు.?
జ : 13వ
3) ఏజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది?
జ : ఆంధ్రప్రదేశ్
4) చైనా లో ప్రముఖ టెక్ బ్యాంకింగ్ సంస్థ యజమాని అదృశ్యమయ్యార ఆయన పేరు ఏమిటి.?
జ : బావో ఫ్యాన్
5) అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని, మెక్‌మోహన్ రేఖ చైనా భారత్ ల మధ్య సరిహద్దుగా గుర్తిస్తున్నామని ఏ దేశం తమ సెనేట్ లో తీర్మానం చేసింది.?
జ : అమెరికా
6) భారతదేశంలో ఇటీవల కొత్త క్యాట్ ఫిష్ ను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు.?
జ : కేరళ
7) తాజాగా భారత హోంశాఖ ఈ రెండు సంస్థలు ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించి నిషేధించింది ?
జ : జమ్మూకాశ్మీర్ గజనవీ ఫోర్స్ (JKGF), ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF)
8) పంజాబ్ కు చెందిన ఎవరిని కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.?
జ : హర్విందర్ సింగ్ సంధు
9) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 250 వికెట్లు, 2,500 పరుగులు సాధించిన ఎన్నో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు.?
జ : 5వ ఆటగాడు
10) టీ హబ్ తో అంకురాల అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది.?
జ : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
11) గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ఫిబ్రవరి 17న ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించబడింది.?
జ : భారత్ (అయోద్య) – నేపాల్ (జనక్‌పూర్)
12) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘టిమ్ జార్జ్’ అనే హ్యాకింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది.?
జ : ఇజ్రాయిల్
13) ఎయిర్ బస్, బోయింగ్ విమానయాన సంస్థల నుండి ఎయిర్ ఇండియా సంస్థ ఎన్ని విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.?
జ : 840
14) ఇటీవల మృతి చెందిన మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఎవరు.?
జ : తులసీదాసు బలరాం
Comments are closed.