CURRENT AFFAIRS IN TELUGU 18th FEBRUARY 2023
1) ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రులకు సీఈవోగా ఎంపికైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : మేఘన పండిట్
2) యూనిసెఫ్ ఇండియా భారత జాతీయ రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఆయుష్మాన్ ఖురానా
3) ఐక్యరాజ్యసమితి 62వ సామాజిక అభివృద్ధి కమీషన్ సెషన్ కు ఎవరు అధ్యక్షత వహించనున్నారు.?
జ : రుచిరా కాంబోజ్
4) ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం
ఆసియా పవర్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం
5) అమెరికాకు చెందిన నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అంటార్కిటికా ఖండంలో ఐస్ ఎంత మేరకు కరిగింది.?
జ : 19.1 లక్షల చదరపు కిలోమీటర్లు
6) ఫిబ్రవరి 17వ తేదీన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పిజీ రాజధాని సువాలో ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్
7) ప్రపంచ హిందీ మహాసభలు 2023 ఫిబ్రవరి 15 నుండి 17 వరకు ఏ దేశంలో జరిగాయి.?
జ : ఫీజి
8) ఇటీవల ఇస్రో ఎస్ఎస్ఎల్వి డి2 ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన JANUS- 2 శాటిలైట్ ను తయారుచేసిన స్టార్టప్ కంపెనీ పేరు ఏమిటి.?
జ : అనంత్ టెక్నాలజీస్ (బెంగళూరు)
9) భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుండి తప్పుకున్నది ఎవరు.?
జ : చేతన్ శర్మ
10) ఖతార్ దేశం భారతదేశానికి చెందిన ‘ఫ్రోజెన్ సీ ఫుడ్’ ని గత నవంబర్ లో ఏ బ్యాక్టీరియా వ్యాప్తి గురించి బ్యాన్ చేసి ఇటీవలనే ఆ బ్యాన్ ను రద్దు చేసింది.?
జ : విబ్రియో కలరా
11) ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : రమేష్ బియాస్
12) ఫిబ్రవరి 18న ఎన్నో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగింది.?
జ : 49వ
13) ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిలువలను గుర్తించారు. దీనితో ప్రపంచంలో లిథియం నిల్వలు ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 7వ స్థానంలో (5.9 మి. టన్నులు)
14) యూరోపియన్ యూనియన్ డీజిల్ మరియు గ్యాస్ కార్ల అమ్మకాలను ఏ సంవత్సరం నుండి పూర్తిగా బ్యాన్ చేయాలని చట్టం చేసింది.?
జ : 2035