CURRENT AFFAIRS IN TELUGU 17th APRIL 2023

1) ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించిన సూరత్ లో తయారు చేసిన వజ్రాల ఉంగరంలో ఎన్ని వజ్రాలను ఉపయోగించారు.?
జ : 50,907

2) శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి కోసం కేంద్ర క్యాబినెట్ ఏ మిషన్ కు ఆమోదం తెలిపింది.?
జ : క్వాంటం మిషన్

3) సెన్సార్ బోర్డు నూతన సవరణ బిల్లు ప్రకారం సినిమాలను వయసులు వారీగా ఎన్ని రకాలుగా వర్గీకరించనున్నారు.?
జ : మూడు రకాలు

4) కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన తొలి వాటర్ బాడిస్ సెన్సస్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్ని జల వనరులు ఉన్నాయి.?
జ : 64,056

5) వాటర్ బాడిస్ సెన్సస్ నివేదిక ప్రకారం జల సంరక్షణ పథకాలు అమలు, చెక్ డాంల నిర్మాణంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : నాలుగవ స్థానం

6) విపత్తుల సమయంలో ఆదుకునేందుకు ఏ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేసింది.?
జ : ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ

7) గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా జాబితాలో చోటు సంపాదించిన సంస్థ ఏది.?
జ : ఇండస్ ఇండ్ బ్యాంకుకు చెందిన భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ లిమిటెడ్

8) 2022 23 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న మొదటి మూడు దేశాలు ఏవి.?
జ : అమెరికా, చైనా, యూఏఈ

9) భారత్ లో పని చేయడానికి అత్యుత్తమ సంస్థగా ఏ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది.?
జ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)

10) కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : లలిత్ కుమార్ గుప్తా