CURRENT AFFAIRS : 18 అక్టోబర్ 2022 Q&A

1) తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఏమిటి.? దాని అర్థం ఏమిటి.?
జ : సిత్రాంగ్ (థాయ్ బాషలో వదలనిది అ అర్థం)

2) భారత్ లో మొదటి సారి సెమీ కండక్టర్ ల అభివృద్ధి కొరకు ‘సెమికాన్ ప్యూచర్ డిజైన్ రోడ్ షో’ ఎక్కడ జరుగుతుంది.?
జ : గుజరాత్

3) స్వీడన్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఉల్ఫ్ క్రిస్టర్‌సన్

4) బంధన్ బ్యాంకు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సౌరవ్ గంగూలీ

5) పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మెళన్ 2022 కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు..?
జ : అక్టోబర్ -17 -2022

6) ఐరాస సెక్రటరీ జనరల్ అంటెనో గుటేరాస్ భారత్ లో ఎప్పుడు పర్యటించనున్నారు.?
జ : అక్టోబర్ – 18 – 20 మధ్య

7) నార్త్ అంట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (NATO) లో ప్రస్తుత సభ్యు దేశాలు ఎన్ని.?
జ : 30

8) నార్త్ అంట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (NATO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బ్రస్సెల్స్ (బెల్జియం)

9) నాటో సభ్య దేశాలు 14వ వార్షిక న్యూక్లియర్ విన్యాసాలను బెల్జియం లో అక్టోబర్ 17 – 30 వరకు నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల పేరు ఏమిటి.?
జ : “STEADFAST NOON”

10) ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతీయం చేశారు.?
జ : 75

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

11) తెలంగాణ లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఎక్కడ ఉన్నాయి.?
జ : ఖమ్మం, సిరిసిల్ల, జనగామ

12) ఏ దేశానికి చెందిన రోష్ అనే ఔషధ, రోగనిర్ధారణ పరికరాల తయారీ సంస్థ హైదరాబాద్ లో ప్లాంట్ ని ఏర్పాటు చేయనుంది.?
జ : స్విట్జర్లాండ్

13) అల్యూమినియం తో చేసిన గూడ్స్ రైలు ను రైల్వే మంత్రి ఎక్కడ ప్రారంభించారు.? వచ్చే సంవత్సరం వరకు లక్ష అల్యూమినియం రైలు బోగీల తయారీ లక్ష్యంగా మంత్రి ప్రకటించారు.?
జ : భువనేశ్వర్

14) భారత వైమానిక దళ సిబ్బంది సతీమణులు చేతితో చేసిన ఎన్ని టోపీలను ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించారు.?
జ : 41,541

15) వారాలలో ఏ వారాన్ని అతి చెత్త వారంగా గిన్నిస్ బుక్ ప్రకటించింది.?
జ : సోమవారం

16) ప్రపంచంలోనే అతి పెద్దదైన పసుపు రంగులో ఉన్న 303.10 క్యారెట్ల వజ్రాన్ని ఎక్కడ వేలం వేయనున్నారు.?
జ : న్యూయార్క్

17) వడదెబ్బ నుండి కాపాడే ORS ద్రావణాన్ని తయారు చేసిన శాస్రవేత్త ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : దిలీప్ మహాలనబీస్

18) భారతదేశం లో మొట్టమొదటి సారి హైడ్రోజన్ ఇంధనంగా గల కారును నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దాని పేరు ఏమిటి.? జ : మిరాయి (భవిష్యత్)

Follow Us @