BIKKI NEWS (OCT. 28) : CPGET 2024 FINAL PHASE COUNSELING SCHEDULE. తెలంగాణ సీపీగెట్ 2024 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.
CPGET 2024 FINAL PHASE COUNSELING SCHEDULE
ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ పరిధిలో పీజీ కోర్సుల్లో సీపీగెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 1వ తేదీనే ఉంటుంది.
నవంబర్ 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పిస్తారు.
నవంబర్ 4న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
చివరి విడత సీట్లను నవంబర్ 8న కేటాయిస్తారు.
సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/