Home > JOBS > TELANGANA JOBS > Yoga instructor Jobs : 842 కాంట్రాక్టు యోగా ఇన్‌స్ట్రక్టర్ జాబ్స్

Yoga instructor Jobs : 842 కాంట్రాక్టు యోగా ఇన్‌స్ట్రక్టర్ జాబ్స్

BIKKI NEWS (SEP. 22) : contract yoga instructor jobs in telangana Ayush. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 421 పోస్టులను పురుషులతో, మరో 421 పోస్టులను మహిళలతో భర్తీ చేయనున్న ట్టు నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది.

contract yoga instructor jobs in telangana Ayush

పురుష యోగా ఇన్స్ట్రక్టర్లు నెల కు కనీసం 32 యోగా తరగతులు, మహిళా యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు 20 యోగా తరగతులకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

వేతనం : ప్రతి తరగతి గంటసేపు ఉంటుందని, ఒక్కో తరగతికి రూ.250 చొప్పున పారితోషికం చెల్లిస్తామని తెలిపింది.

ఎంపిక విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది.

ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

ఇంటర్వ్యూ తేదీలు : సెప్టెంబర్ 24న ఆదిలాబాద్, హైదరాబాద్, 25న నిజామాబాద్, 26న మెదక్, రంగారెడ్డి, 27న వరంగల్, నల్లగొండ, 28న కరీంనగర్, 30న ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

వెబ్సైట్ : https://ayush.telangana.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు