BIKKI NEWS (JULY 16) : contract jobs in tg handlooms and textile department. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు పద్దతిలో 30 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
contract jobs in tg handlooms and textile department
ఖాళీల వివరాలు :
క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్- 08
టెక్స్‌టైల్ డిజైనర్ – 22
కాంట్రాక్టు గడువు : మూడేండ్లకు గానూ మొదటి సంవత్సరం నియమించుకొని పనితీరు ఆధారంగా పొడిగిస్తారు.
అర్హతలు : సీడీఈ పోస్టులకు ఐఐహెచీటీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు రెండేళ్లు సీడీఈగా పనిచేసిన అనుభవం ఉండాలి.
టెక్స్టైల్ డిజైనర్ పోస్టులకు నిఫ్ట్/ఎన్ఐడీ లేదా పేరున్న సంస్థ నుంచి డిజైనింగ్ లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వేతనం : నెలకు రూ 24,000/- రూపాయల వేతనం ఇస్తారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 21 రోజుల్లోగా నాంపల్లిలోని చేనేత జౌళి శాఖ కార్యాలయ భవనం లో బయోడేటా ఫారమ్ నింపి, అర్హత సర్టిఫికెట్ లను నింపి ఇవ్వాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://tsht.telangana.gov.in/HNDM/Views/Home.aspx