Home > JOBS > GURUKULA JOBS > Contract Jobs – గురుకుల సీవోఈ లలో భారీగా ఉద్యోగాలు

Contract Jobs – గురుకుల సీవోఈ లలో భారీగా ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 25) : Contract Jobs in Gurukula COEs. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న ఫౌండేషన్ COEల యందు IIT-JEE, NEET మరియు CMA-CLAT శిక్షణ ఇవ్వడానికి అర్హత, అనుభవం కలిగిన నిష్ణాతులైన బోధకుల నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయుటకు దరఖాస్తులు కోరబడుతున్నవి.

Contract Jobs in Gurukula COEs.

సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు
  • మ్యాథ్స్-20,
  • ఫిజిక్స్-21,
  • కెమిస్ట్రీ-20,
  • బోటనీ-10,
  • జువాలజీ -09
  • CMA Foundation (అన్ని పేపర్లకు) – 4,
  • CLAT కొరకు
  • Legal Reasoning-1,
  • Logical Reasoning-1,
  • Quantitative techniques-1

తగిన అర్హతలు గల వారు క్రింద తెలిపిన తేదీలలో ఆయా కళాశాలల యందు వ్రాత పరీక్ష, డెమో మరియు ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో ఉదయం 9.00am హాజరు కాగలరు.

డెమో & ఇంటర్వ్యూ తేదీలు & చిరునామా

గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ జూన్ 27 – 2025 నాడు గౌలిదొడ్డి, హైదరాబాద్ నందు

బాటనీ, జువాలజీ, CMA,CLAT జూన్ 28 – 2025న నార్సింగి‌, హైదరాబాద్ నందు నిర్వహించబడును.

ఎంపిక కాబడిన వారికి, వారి అనుభవం ఆధారంగా గంటకు గరిష్టంగా రూ 650/- వరకు గౌరవ వేతనం ఇవ్వబడును మరియు వీరు ఎంపిక కాబడిన కళాశాలల యందు ఉదయం 8.00am నుండి సాయంత్రం 5.00pm వరకు పని చేయవలసి ఉంటుంది.

పని ప్రదేశాలు

IIT – JEE CENTRES

1) గౌలిదొడ్డి – హైదరాబాద్ (బాయ్స్)
2) గౌలిదొడ్డి – హైదరాబాద్ (గర్ల్స్)
3) ఉప్పల్ – హైదరాబాద్ (గర్ల్స్)
4) కరీంనగర్ (గర్ల్స్)
5) నార్సింగి‌ – హైదరాబాద్ (గర్ల్స్)
6) షేక్ పేట – హైదరాబాద్ (బాయ్స్)

NEET CENTRES

1) మహేంద్ర హిల్స్ – హైదరాబాద్ (గర్ల్స్)
2) ఫలక్‌నుమా – హైదరాబాద్ (గర్ల్స్)
3) చిలుకూరు – హైదరాబాద్ (బాయ్స్)

CMA – CLAT CENTERS

1) సరూర్ నగర్ – హైదరాబాద్ (గర్ల్స్)
2) ఇబ్రహీంపట్నం – హైదరాబాద్(బాయ్స్)

మరిన్ని ఇతర వివరాలకు Helpline No: 04023391598 ను సంప్రదించగలరు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు