AP JOBS : శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష లేకుండా 1,383 ఉద్యోగాలు

శ్రీకాకుళం (సెప్టెంబర్ – 18) : శ్రీకాకుళం జిల్లా లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (apscscl), జిల్లా కార్యాలయం… శ్రీకాకుళం జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 1,383 ఉద్యోగాల (contract jobs in civil supplies department srikakulam district) భర్తీకి ప్రకటన విడుదల అయింది.

పోస్టుల వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్ – 461
డేటాఎంట్రీ ఆపరేటర్ – 461,
హెల్పర్ – 461.

అర్హతలు :

టెక్నికల్ అసిస్టెంట్:

బీఎస్సీ(అగ్రికల్చర్ /మైక్రో బయాలజీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ) బీఎస్సీ (బీజెడీసీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ :

ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

హెల్పర్ :

8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పరు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ / డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనా లో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

చిరునామా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్ – 25 – 2023

వెబ్సైట్: https://srikakulam.ap.gov.in/