కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 30) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన సచివాలయ ప్రారంభ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఫైలు పై తన తొలి సంతకాన్ని పెట్టారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్ కు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి మంత్రివర్గ భేటీలోనే నిర్ణయం తీసుకొని 2016లోనే జీవో నెంబర్ 16ను విడుదల చేయడం జరిగింది. అనంతరం అనేక న్యాయపరమైన చిక్కులను దాటుకుంటూ నేటికీ ఆ జీవో కార్యరూపం దాల్చడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగ, అధ్యాపకుల సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 11 వేల కుటుంబాలకు మేలు చేకూర్చే సీఎం కేసీఆర్ తొలి దస్త్రం పై సంతకం పెట్టడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.