5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అమోదం

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 30) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ వివిధ శాఖలలో పనిచేస్తున్న 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలుపుతూ జీవో నంబర్ 38 ను విడుదల చేసింది.

సంబంధిత హెచ్ఓడీలు శాంక్షన్ మరియు క్లియర్ వెకెంట్ పోస్టులలో సంబంధిత కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మొత్తం 40 విభాగాలలో 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నూతన సచివాలయంలో క్రమబద్ధీకరణ జీవో ప్రతిని కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ చైర్మన్ సిహెచ్ కనకచంద్రానికి ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అందజేయడం జరిగింది.