Jobs – టీజీ న్యాబ్‌ కాంట్రాక్టు డ్రైవర్ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP 13) : contract driver jobs in tg nab. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరోలో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (డ్రైవర్‌) ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టీజీ న్యాబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

contract driver jobs in tg nab.

అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారై ఉండాలని, ఆధార్‌, ఓటర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరని తెలిపారు.

మాజీ సైనికులు, మాజీ పారా మిలటరీ సిబ్బంది వయసు ఈ నెల 30 నాటికి 58 ఏండ్లకు మించొద్దని తెలిపారు.

గౌరవ వేతనం రూ.26 వేలు ఇస్తారని, సెలవులు ఉండవని స్పష్టం చేశారు. అత్యవసర సందర్భాల్లో గౌరవ వేతనం ఇవ్వకుండా సెలవు ఇస్తారని పేర్కొన్నారు.

ఆసక్తి గలవారు దరఖాస్తులను పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని డైరెక్టర్‌ తెలంగాణ యాంటీ నారోటిక్‌ బ్యూరోకు పంపాలని, దరఖాస్తులకు ఈ నెల 20 ఆఖరు తేదీ అని పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు