BIKKI NEWS (JULY 08) : contract degree lecturers issues in telangana. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ ల కనీసం సమస్యలను తెలియచేద్ధమoటే అందుబాటులో రావడంలేదని, కనీసం చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేస్తలేరని TGDCLA రాష్ట్ర అధ్యక్షులు, కాలేజియేట్ కో చైర్మన్ డా.యం వినోద్ కుమార్ వాపోయారు.
contract degree lecturers issues in telangana
ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ లుగా నిలబడ్డ వీరి మాటలు నమ్మి మోసపోయామని బాధను వ్యక్తం చేశారు. ఎలక్షన్ ల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి సరిగా గెలిచిన తర్వాత కనీసం ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్సీలు కనీసం ఫోన్ కూడా ఎత్తకపోవడం గమనార్హమని తెలిపారు.
గతంలో మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్యల పరిష్కారం లో ఎమ్మెల్సీలే ప్రధాన సూత్రదారులుగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి లు ఇద్దరు కూడా సమస్య వినే ఓపిక , సమస్య ల పై అవగాహన లేదని ఇలాంటి ఎమ్మెల్సీలతో ఇంకా 5 సంవత్సరాలు ఎలా భరించాలో అని ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి 2010 డిసెంబర్ లో మొట్టమొదటి బేసిక్ పే కాంట్రాక్ట్ లెక్చరర్స్ సాధించడంలో అప్పటి ఎమ్మెల్సీ శ్రీ MVS శర్మ గారు 8 రోజులు ఆమరణ నిరాహారణ దీక్ష చేశారని గుర్తు చేశారు. తర్వాత కార్యక్రమం అయినా పాతిరి సుధాకర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి , కూర రఘోతంరెడ్డి, నర్సిరెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క చాలా సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వద్దకు సమస్యని తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేశారని గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం ఒక్క శ్రీపాల్ రెడ్డి తప్ప ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు ప్రభుత్వానికి , అధికారులకు మరియు వివిధ విద్యా శాఖ ఉద్యోగులకు సుధానకర్తలుగా ఉండి సమస్యలు పరిష్కారం చేసే ఆలోచన, అవగాహన కూడా లేదని బాధను వ్యక్తం చేశారు.
గత 4 నెలలుగా వేతనాలు లేక రెన్యువల్ ఉత్తర్వులు రాక కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే కనీసం ఈ ఎమ్మెల్సీలు ఎలాంటి పట్టింపులేకపోగా అసలు లెక్చరర్ సంఘ రాష్ట్ర నాయకుల పోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, వారి PA లు కూడా సరియైన సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు.
ఇప్పటికే డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు చాలా మానసిక సంక్షోభంలో ఉన్నారని కనీసం చిన్న చిన్న సమస్యలు అనగా ప్రస్తుతం రెన్యువల్ జీవో (అనగా 459 కాంట్రాక్టు లెక్చరర్ లు, 441 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 1,260 మంది గెస్ట్ లెక్చరర్ లు, 50 మంది TSKC ఉద్యోగుల రెన్యూవల్), పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు గురించి ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి మాటలు విని మోసపోయామని ఇప్పటికే వారి స్వభావం అర్థమైపోయిందని పేర్కొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్