Home > JOBS > ANGANWADI JOBS > Anganwadi jobs – 14236 అంగన్వాడీ నియామకాలకు కమిటీ

Anganwadi jobs – 14236 అంగన్వాడీ నియామకాలకు కమిటీ

BIKKI NEWS (JULY 07) : committe formed for recruitment of anganwadi jobs. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్ల ఖరారు చేసేందుకు శిశు సంక్షేమ శాఖ కమిటీని నియమించారు.

committe formed for recruitment of anganwadi jobs.

ఈ కమిటీ ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఖరారు చేయనుంది.

జీవో నం. 3 ని రద్దు చేయడంతో తెలంగాణ రాష్ట్రం లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాతృ భాషలో బోధన చేయాలంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో విధానాన్ని పరిశీలించేందుకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది.

అనంతరం నూతన రోస్టర్ పాయింట్లు ఆధారంగా 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు