BIKKI NEWS (JUNE 07) : CHINAB RAILWAY BRIDGE. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం వందే భారత్ రైలు చినాబ్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించింది.
CHINAB RAILWAY BRIDGE
చినాబ్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డులకు ఎక్కింది.
1486 కోట్ల వ్యయంతో ఎనిమిది ఏళ్లలో ఈ వంతెనను నిర్మించారు.
చినాబ్ నది గర్భం నుండి దీని ఎత్తు 359 మీటర్లు.
ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు అధికము
చినాబ్ బ్రిడ్జ్ పొడవు 1.32 కిలోమీటర్లు
ఈ బ్రిడ్జి మీద రైలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు
అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను కూడా తట్టుకోగలరు.
ఈ బ్రిడ్జి జీవితకాలం 120 ఏళ్లు.
ఈ బ్రిడ్జి ద్వారా జమ్మూ – శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది
ANJI CABLE BRIDGE
ప్రధాని నరేంద్ర మోడీ అంజి కేబుల్ రైల్వే బ్రిడ్జిని కూడా ప్రారంభించారు.
ఇండియాలో అత్యంత ఎత్తైన కేబుల్ రైల్వే బ్రిడ్జి ఇదే.
నదీ గర్భం నుండి దీని ఎత్తు 196 మీటర్లు.
చినాబ్ కు ఉపనది అయిన అంజి నదిపై దీని నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన నిర్మాణానికి పూర్తిగా ఉక్కును ఉపయోగించారు.
దీని మొత్తం పొడవు 725 మీటర్లు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్