NOBEL 2024 – కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ కు రసాయన నోబెల్

BIKKI NEWS (OCT. 09) : The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.”

ర‌సాయ‌న శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పుర‌స్కారాన్ని ప్రొటీన్ డిజైన్‌, స్ట్ర‌క్చ‌ర్‌పై వ‌ర్క్ చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు ద‌క్కింది. స‌గం భాగం అవార్డు డేవిడ్ బేక‌ర్‌కు ద‌క్క‌గా, మ‌రో స‌గం భాగం డేమిస్ హ‌స్సాబిస్‌, జాన్ ఎం జంప‌ర్‌ల‌కు శాస్త్ర‌వేత్త‌ల‌కు ద‌క్కింది.

NobelPrize in Chemistry “for computational protein design

కాంపుట్యూష‌న‌ల్‌ ప్రొటీన్ డిజైన్ మరియు ప్రొటీన్ నిర్మాణాన్ని అంచ‌నా వేసినందుకు నోబెల్ బహుమతి అందజేశారు.

ప్రోటీన్లలో దాగిన సీక్రెట్ల‌ను ప‌సిక‌ట్టారు. కంప్యూటింగ్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోటీన్ల ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. డెమిస్‌, జాన్‌లు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాదాపు అన్ని ప్రోటీన్ల‌ను స్ట‌డీ చేశారు.

ర‌సాయ‌న‌శాస్త్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నోబెల్ పుర‌స్కారాన్ని 115 సార్లు ప్ర‌క‌టించారు. ఆ అవార్డును 194 మంది సొంతం చేసుకున్నారు. 1901 నుంచి 2023 వ‌ర‌కు కెమిస్ట్రీలో నోబెల్ పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఫ్రెడ్రిక్ సాంగ‌ర్‌, బ్యారీ షార్ప్‌లెస్ శాస్త్ర‌వేత్త‌లు రెండు సార్లు కెమిస్ట్రీలో అవార్డుల‌ను అందుకున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు