CHANDRAYAAN – 3 : నేడే సాప్ట్ ల్యాండింగ్ – ALL THE BEST ISRO

హైదరాబాద్ (ఆగస్టు – 23) : CHANDRAYAAN – 3 ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రయోగం… జాబిల్లి దక్షిణ భాగాన్ని టచ్ చేసే తొలి దేశం భారతదేశం కావాలని ప్రతి భారతీయుడు మనఃపూర్వకంగా ముక్కోటి దేవతలను కోరుకుంటున్న ఘడియలు… ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్- 3 సాప్ట్ ల్యాండింగ్ జరగాలని ప్రతి భారతీయుడీ తరపున ALL THE BEST ISRO…

★ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ విధానం

ల్యాండర్ మాడ్యూల్ లో అన్ని పారామీటర్లు తనిఖీ చేసి… ల్యాండింగ్ ప్రాంతాన్ని నిర్దేశించుకొన్న తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధింత కమాండ్లను షెడ్యూల్
ల్యాండింగ్ కు రెండు గంటల ముందు ల్యాండర్ మాడ్యూల్ కు అప్లోడ్ చేస్తారు.

ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగు పెడుతుంది. రెట్రో ఫైరింగ్ ద్వారా తన 4 థ్రస్టర్ ఇంజిన్లను మండించుకొంటుంది. అనంతరం చంద్రుడి గురుత్వాకర్షణకు అనుగుణంగా వేగాన్ని తగ్గించుకొంటుంది.

జాబిల్లి ఉపరితలానికి 6.8 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొన్న తర్వాత రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి, మిగిలిన రెండింటిని మాత్రమే వినియోగించుకొంటుంది. రివర్స్ థ్రస్ట్ ల్యాండర్ మాడ్యూల్ మరింత కిందకు వస్తుంది.

చంద్రుడి ఉపరితలానికి 150- 100 మీటర్ల ఎత్తుకు వచ్చిన తర్వాత ల్యాండర్ తన సెన్సార్లు‌, కెమెరాలను వినియోగించుకొని సాఫ్ట్ ల్యాండింగ్ కోసం బండరాళ్లు,
ఎగుడుదిగుడు లేని ప్రాంతం కోసం వెతుకుతుంది.

ల్యాండింగ్ ప్రారంభ ప్రక్రియలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68
కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ వేగం వద్ద ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీలు వంపు తిరిగి ఉపరితలానికి నిలువుగా వస్తుంది.

VIKRAM LANDER సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత దాని నుండి PRAGNAN ROVER చంద్రుని ఉపరితలం పైకి వస్తుంది.. ఇది అక్కడి వాతావరణం, చంద్రుని ఉపరితలం పై మట్టిని విశ్లేషించి సమాచారాన్ని ISRO కి చేరవేస్తుంది.