CHANDRAYAAN 3 : ఆగస్టు 23 సాయంత్రం 06:04 గంటలకు

హైదరాబాద్ (ఆగస్టు – 21) : CHANDRAYAAN – 3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది. జులై 14న ప్రారంభమైన చంద్రయాన్ 3 మిషన్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూకక్ష్య నుండి నెమ్మదిగా చంద్రుని కక్ష్యకు చేరుకుంది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ కానుంది.

చంద్రుని కక్ష్యలోకి చేరిన తర్వాత విజయవంతం ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ వేరుపడి చంద్రుని వైపు నెమ్మదిగా చేరుకుంది. ప్రస్తుతం 25 × 134 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలో ల్యాండ్ విక్రమ్ ప్రయాణిస్తుంది.

◆ విఫలమైన LUNA 25

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన LUNA 25 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత అనుహ్య వాతావరణ పరిస్థితుల కారణంగా క్రాస్ అయినట్లు ROSCOSMOS ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందరి చూపు చంద్రయాన్ 3 ల్యాండింగ్ పైనే ఉంది.

◆ CHANDRAYAAN – 3 LIVE

ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై కాలుమోపనున్న లాండర్ ప్రయోగాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ఆగస్టు 23 సాయంత్రం 5.27 గంటల నుండి ప్రారంభం కానుంది.