మహిళా పోరాట శక్తికి ప్రతిక ఐలమ్మ – ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి

  • జి.జే.సి ధర్మకంచలో ఘనంగా ఐలమ్మ జయంతి ఉత్సవాలు

BIKKI NEWS (SEP. 26) : chakali ilamma jayanthi programme in GJC Dharmakancha. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ జనగామ నందు ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

chakali ilamma jayanthi programme in GJC Dharmakancha

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… అన్యాయంను ఎదిరించడం వీరుల లక్షణం ఇట్లాంటి వీరవనితల్లో చిట్యాల ఐలమ్మ ఒకరు, భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరులో పాల్గొని తెలంగాణ వీరత్వం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహిళా పోరాట శక్తి కి ప్రతీక వీరనారి ఐలమ్మ.
” బట్టలుతికి బ్రతికి పో ” అని హేళన చేసిన దొరలతో బరిగేసి కొట్లాటకు దిగింది. “బాంచన్ కాల్మొక్త ” అన్న ప్రజలతో బందుకి చేత పట్టించింది. కమ్యూనిస్టుల సహాయంతో ఎర్రజెండాలను చేపట్టి నిజాం ప్రభుత్వాన్ని, దోరలను గడగడలాడించింది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత లక్షల ఏకరాల భూమిని పేదలకు పంచడంలో ముఖ్యపాత్ర వహించింది.
అలాంటి వీరవనిత కు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షనీయం అన్నారు. ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం మనం మన ఆత్మగౌరవానికి మరియు ఐలమ్మ ఇచ్చే ఘన నివాళులు గా చెప్పుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అఫ్జాల్, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వరూదిని,శ్రీనివాస్, గణేష్, రజిత,తిరుమలేష్, ముక్తాదిర్,మరిపెల్ల రవిప్రసాద్,సమ్మయ్య,శంకర్, జ్యోతి, మధు మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD