Home > EDUCATION > SCHOLARSHIP > NATIONAL SCHOLARSHIP > Merit Scholarship – ఇంటర్ పూర్తైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్

Merit Scholarship – ఇంటర్ పూర్తైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్

BIKKI NEWS (JULY 07) : central merit scholarship for intermediate complete students. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్ష ప్రోత్సాహన్ యోజన పథకం కింద సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కు మెరిట్ స్కాలర్ షిప్ కొరకు ప్రకటన విడుదల చేశారు.

central merit scholarship for intermediate complete students

ఏడాదికి 82,000 మందికి మెరిట్ స్కాలర్షిప్ లను దేశవ్యాప్తంగా అందజేయడానికి ప్రకటన విడుదల చేసింది.

స్కాలర్షిప్ వివరాలు : ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు డిగ్రీలో సంవత్సరానికి 12,000/-, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సంవత్సరానికి 20,000/- చొప్పున అందించనుంది. ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగవ, ఐదవ సంవత్సరానికి సంవత్సరానికి 20 వేల రూపాయల చొప్పున అందజేస్తారు

అర్హతలు : ఇంటర్మీడియట్ పరీక్షలో 80% పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు.

విద్యార్థులు కుటుంబ వార్షికాదాయం 4.5 లక్షల లోపు ఉండాలి.

ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి.

ప్రతి సంవత్సరం 50 శాతం మార్కులు 70 శాతం హాజరు ఉండాలి

వయోపరిమితి : 18 నుండి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానము & గడువు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://scholarships.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు