DIGITAL CENSUS : డిజిటల్ జనగణన

హైదరాబాద్ : భారత దేశ జనాభా లెక్కల సేకరణ ఇకపై పూర్తిగా ఎలాంటి కాగితం వాడకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోనే వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2 మొబైల్ యాప్ లను రూపొందించింది. వీటిలో ఒకటి అధికారులకు మరొకటి పౌరులకు కేటాయిస్తారు.

33 ప్రశ్నలతో కూడిన వివరాల ఫారం యాప్ లో ఉంటుంది. జనాభా సేకరణ అధికారులు తమ యాప్ లో ఆయా వివరాలను నమోదు చేస్తారు. ఒకవేళ ప్రజల ఎవరికైనా ఆసక్తి ఉంటే నేరుగా యాప్ లోనూ నమోదు చేసుకోవచ్చు. అలా ప్రజల నమోదు చేసుకున్న వివరాలను జనాభా అధికారులు ఇంటికొచ్చి పరిశీలిస్తారు.

భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జనగణన జరగాలి. చివరిసారిగా 2011లో జరిగింది. 2021 జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. తదుపరి జనగణన 2024 లో ఉండవచ్చని సమాచారం.