Home > EDUCATION > INTERMEDIATE > CC CAMERAS – ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తరగతికో సీసీ కెమెరా

CC CAMERAS – ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తరగతికో సీసీ కెమెరా

BIKKI NEWS (JUNE 05) : CC CAMERAS IN GJCs CLASS ROOMS. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి తరగతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

CC CAMERAS IN GJCs CLASS ROOMS.

రాష్ట్రవ్యాప్తంగా 430 కాలేజీలుండగా, 5,500 సీసీ కెమెరాలు బిగించనున్నారు. ఈ సీసీటీవీ కెమెరాలను నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అలాగే ఇంటరాక్టివ్ సీసీ కెమెరాల ద్వారా కళాశాలలకు తగు సూచనలిస్తారు.

లెక్చరర్లకు సెలవుల మంజూరుపైనా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తారు. లెక్చరర్లు సెలవుపై వెళితే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే సెలవు తీసుకోవాలి.. లేదంటే టైంటేబుల్ ప్రకారం పాఠాలు చెప్పాలి. గైర్హాజరవడానికి మాత్రం వీల్లేదు.

FACIAL ATTENDANCE FOR STUDENTS

ఈ విద్యాసంవత్సరం నుంచే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎస్ఆర్ఎస్)ను విద్యార్థులకు అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు కాలేజీకి గైర్హాజరు కాగానే నేరుగా తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ వెళ్లడం ఈ విధానం ప్రత్యేకత. ఎఫ్ఎర్ఎస్ ఉపకరణాల బిగింపునకు టెండర్లు ఆహ్వానించారు. నెలాఖరు కల్లా కాలేజీలన్నింటిలో బిగిస్తారు. విద్యార్థుల హాజరును పర్యవేక్షించడమే కాకుండా తల్లిదండ్రులకు విద్యార్థుల గైర్హాజరు సమాచారాన్ని చేరవేస్తారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు