BIKKI NEWS (SEP. 21) : CBSE SYLLABUS IN AP INTERMEDIATE EDUCATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనున్నారు. ఇది అమలులోకి వస్తే.. గణితంలో దాదాపు 30 శాతానికి పైగా సిలబస్ తగ్గిపోనుంది. అలాగే రసాయన, భౌతికశాస్త్రాల్లోనూ సీబీఎస్ఈతో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది. ఇవి కూడా తగ్గనున్నాయి.
CBSE SYLLABUS IN AP INTERMEDIATE EDUCATION
గణితంలో ప్రస్తుతం రెండు పేపర్ల విధానం ఉండగా, దాన్ని ఒకటి చేయాలా? రెండుగానే ఉంచాలా? అనే దానిపై కసరత్తు కొనసాగుతోంది.
సిలబస్ మార్పుపై ఇప్పటికే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతోనూ విద్యా మండలి సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.
మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ కోచింగ్ ఇప్పించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ యోచిస్తోంది.
ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉమ్మడి త్రైమాసిక పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రైవేటు మినహా అన్ని యాజమాన్యాలూ ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, మార్కులను ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.