Home > EDUCATION > SCHOLARSHIP > CBSE SCHOLARSHIP – సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్

CBSE SCHOLARSHIP – సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్

BIKKI NEWS (SEP. 16) : CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2024. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు సీబీఎస్‌ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది.

CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2024.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికల నుండి 2024 సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ కింద దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.

స్కాలర్షిప్ విలువ : నెలకు 500/- చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందిస్తారు

అర్హతలు : సీబీఎస్ఈ లో పదోతరగతిలో 60% తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అనుబంధ విద్యాసంస్థలో 11వ తరగతి అడ్మిషన్ పొంది ఉండాలి.

ఇప్పటికే ఈ స్కాలర్షిప్ అందుకుంటున్న విద్యార్థినిలు 12వ తరగతిలో రెన్యువల్ చేసుకోవాలంటే పదకొండవ తరగతిలో 50% మార్కులను సాధించి ఉండాలి.

దరఖాస్తు గడువు ఫిబ్రవరి 08వ తేదీ వరకు కలదు.

వెబ్సైట్ : https://www.cbse.gov.in/cbsenew/scholar.html

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు