BIKKI NEWS (APRIL 05) : క్యాన్సర్ చికిత్సకు ఐఐటీ బాంబే, టాటా ఇనిస్టిట్యూట్ లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన CAR T CELL THEROPHY (చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపి) భారత్ లో రాష్ట్రపతి ద్రౌపది మీర్ము చేత ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలోనే క్యాన్సర్ కు
అత్యుత్తమ చికిత్స గా దీనిని పరిగణిస్తున్నారు. దీనికి వాణిజ్య పరంగా “నెక్స్‌కార్ 19” అని నామకరణం చేశారు.
ఇప్పటికే అమెరికా మరియు కొన్ని దేశాలలో ఈ చికిత్స ప్రారంభమైంది. అమెరికా లో ఈ చికిత్స ఖరీదు 4 కోట్లు కాగా భారత్ లో 40 లక్షలకే ఈ చికిత్స ను అందుబాటులో ఉండనునున్నట్లు సమాచారం.
క్యాన్సర్ కు మొదట సర్జరీ, కీమోథెరపి, రేడియో థెరపీ చికిత్సలు అందుబాటులోకి రాగా తాజాగా CAR T CELL THEROPHY అందుబాటులోకి వచ్చింది. ఇది పై మూడు చికిత్సలకంటే ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
What is CAR T CELL THEROPHY.?
ఇది భాదితుని యొక్క రక్తం నుంచి తయారు చేసిన ఒక సజీవమైన ఔషదాన్ని అందించే చికిత్స. ఐదు దశలలో ఈ చికిత్స ఉంటుంది.
ముందుగా క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితుని యొక్క రక్తాన్ని సేకరించి అందులో నుండి టీ సెల్స్ ను వేరు చేస్తారు.
ఈ టి సెల్స్ లోకి CAR అనే క్యాన్సర్ తో పోరాడే జన్యువుని చొప్పిస్తారు. తరువాత ల్యాబ్ లోనే ఈ టి సెల్స్ ను కోట్ల సంఖ్యలో అభివృద్ధి చేస్తారు.
ఈ అభివృద్ధి చేసిన టి సేల్స్ ను రోగి రక్తం లోకి ఎక్కిస్తారు. ఈ టీ సెల్స్ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని అంతం చేస్తాయి.