BSc Agri. – 20న వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్‌

BIKKI NEWS (JAN. 19) : తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాల(జగిత్యాల)లో బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నెల 20న మూడో విడత కౌన్సెలింగ్‌ (BSc Agriculture Hons. Admissions in telangana) నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎంసెట్‌-2023 బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించింది.