బీసీ డిగ్రీ గురుకులాలో ఎంసెట్ ర్యాంక్ తో BSc అగ్రికల్చర్ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూలై – 06) : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలలో B.Sc. (Hons.) Agriculture మొదటి సంవత్సరంలో ప్రవేశానికై 2023-24 విద్యా సంవత్సరంలో EAMCET – 2023 ప్రవేశ పరీక్షలో అర్హులైన విద్యార్థినుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనది.

మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు: వనపర్తి మరియు కరీంనగర్.

◆ కోర్సు : B.Sc., (Hons.) Agriculture.

◆ దరఖాస్తు ప్రారంభ తేది : 06-07-2023

◆ చివరి తేది : 30-07-2023,

◆ దరఖాస్తు రుసుము : రూ.1000/-

◆ విద్యార్థుల ఎంపిక: EAMCET-2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేయబడును.

విద్యార్థినీలు కాలేజి హాస్టల్ లోనే ఉండాలి. డే-స్కాలర్స్ విధానం ఉండదు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న దరఖాస్తుదారుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000/- (రూ. లక్షా యాభై వేలు మాత్రమే) మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే దరఖాస్తుదారులకు రూ.2,00,000/- (రూ. రెండు లక్షలు మాత్రమే) మించని మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వివరాలకు కార్యాలయ పనివేళల్లో 040-23328266 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు.

అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా PJTSAU AGRICET-2023 ఫలితాలు ప్రకటించిన తర్వాత డిప్లొమా హోల్డర్ల కోసం ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడిగా జారీ చేయబడుతుంది.

◆ వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in