BRICS : డాలర్ కి వ్యతిరేకంగా పుట్టిన కూటమి

BIKKI NEWS : BRICS – బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం బ్రిక్స్ 2009 ఏర్పడ్డ కూటమి మొదటి సమావేశం 2009 లో జరిగింది. వాస్తవానికి మొదటి నాలుగు దేశాలు 2010 లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు ” BRIC “గా పివలబడ్డ కూటమి తర్వాత BRICS గా మారింది. Brics 2023 meeting and Brics history

Brics 2023 meeting and Brics history

ఇవన్నీ జి20 లో సభ్యులే. ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు. 2009 నుండి, బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి.

★ BRIC నామకరణం :

“బ్రిక్” అనే పదాన్ని 2001 లో అప్పటి గోల్డ్‌మెన్ సాక్స్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్ జిమ్ ఓ’నీల్ తన బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే పుస్తకంలో ఉపయోగించాడు. కానీ, వాస్తవానికి, అసలు నివేదికలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉన్న రూప పురుషోత్తమన్ ఈ పదాన్ని సూచించారు..

★ మొదటి సమావేశం :

యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్ మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009 జూన్ 16 న ప్రారంభమైంది, లూయిజ్ ఇనాసియో, లూలా డా సిల్వా, డిమిత్రి మెద్వెదేవ్, మన్మోహన్ సింగ్, హు జింటావో హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో నాలుగు దేశాలు ఎలా బాగా సహకరించుకోగలవో చర్చించారు.

యెకాటెరిన్ బర్గ్ శిఖరాగ్ర సమావేశం తరువాత, బ్రిక్ దేశాలు కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని ప్రకటించాయి, ఇది “విభిన్నంగా, స్థిరంగా, ఊహించగలిగేలా” ఉండాలి. ఈ ప్రకటనలో యుఎస్ డాలర్ “ఆధిపత్యాన్ని” ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ ఉద్దేశ్యం మాత్రం డాలర్ యొక్క అంతర్జాతీయ మారకాన్ని వ్యతిరేకించడమే.

★ దక్షిణాఫ్రికా చేరిక

2010 లో, దక్షిణాఫ్రికా బ్రిక్ సమూహంలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దాని అధికారిక ప్రవేశం 2010 సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. చైనా అధికారికంగా ఆహ్వానించిన తరువాత, 2010 డిసెంబరు 24 న దక్షిణాఫ్రికా అధికారికంగా సభ్య దేశంగా మారింది. తరువాత ఇతర బ్రిక్ దేశాలు అంగీకరించాయి. సమూహం యొక్క విస్తరించిన సభ్యత్వాన్ని ప్రతిబింబించేలా ఈ బృందానికి బ్రిక్స్ అని పేరు పెట్టారు – దక్షిణాఫ్రికా కొరకు “ఎస్” చేరింది 2011 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, చైనాలోని సాన్యాలో జరిగిన 2011 బ్రిక్స్ సదస్సుకు పూర్తి సభ్యునిగా హాజరయ్యాడు.

★ సమావేశాలు

బ్రిక్ మొదటి సమావేశం – 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.

రెండో సమావేశం – బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.

మూడో సమావేశం – చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.

నాలుగో సమావేశం – న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.

ఐదో సమావేశం – దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.

ఆరో సమావేశం – బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.

ఏడో సమావేశం – రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.

ఎనిమిదో సమావేశం – గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.

తొమ్మిదో సమావేశం – చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.

పదో సమావేశం దక్షిణాఫ్రికా లో ని సరిల్ రాంఫోసా లో జూలై 2018లో జరిగింది.

పదకొండవ సమావేశం బ్రెజిల్ లో ని బోల్సునారో లో నవంబర్ 2019 లో జరిగింది.

పన్నెండవ సమావేశం రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్ లో నవంబర్ 2020 లో వర్చువల్ పద్దతిలో జరిగింది

పదమూడవ సమావేశం భారత్ లోని న్యూఢిల్లీ నుండి సెప్టెంబర్ – 2021 లో వర్చువల్ పద్దతిలో జరిగింది

పద్నాలుగవ సమావేశం చైనా -బీజింగ్ లో జూన్ -2022 లో జరిగింది

పదిహేనవ సమావేశం ఆగస్టు 22- 24 వరకు దక్షిణాఫ్రికా లోని జోహెన్నస్‌బర్గ్ లో జరుగుతుంది.

CURRENT AFFAIRS

TELEGRAM CHANNEL