Home > NATIONAL > డిల్లీ కమలం కైవసం

డిల్లీ కమలం కైవసం

BIKKI NEWS (FEB. 08) : BJP WON DELHI ELECTIONS 2025. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాదించే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.

BJP WON DELHI ELECTIONS 2025.

మొత్తం 70 స్థానాలలో 48 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. రెండు సార్లు అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

ముఖ్యంగా ఆప్ పార్టీ ముఖ్య నాయకులు ఓటమి దిశలో పయనిస్తున్నారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, డిల్లీ సీఎం అతిశీ, సిసోడియా ఓటమి పాలయ్యారు.

అయితే సోషల్ మీడియాలో లో #EVMHACK అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో నడుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కి దేశరాజధాని లో కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం విశేషం.

గెలుపు ఓటముల మద్య అంతరం చాలా తక్కువగా ఉండడంతో పోటీ తీవ్ర స్థాయిలో జరిగినట్లు అవగతం అవుతుంది.

అయితే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ కి వ్యతిరేకత పెరగడంతో ఓటమి తప్పలేదు.

ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల వరకు వెలువడే అవకాశం ఉంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు